పాలకొల్లు: మార్చి,8(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి మాట్లాడుతూ మహిళల సాధికారత, సమానత్వం మరియు సమాజంలో మహిళల కీలక పాత్రపై అవగాహన కల్పించారు. విద్యార్థినులకు కళాశాలలో నిర్వహించే వివిధ రకాల స్కిల్ కోర్సులు దాని ఆవశ్యత గురించి వివరించారు.
ఈ కార్యక్రమానికి పాలకొల్లు టౌన్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రజిని కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత, గౌరవం మరియు అభివృద్ధి కోసం సమాజం మొత్తం కలసి పనిచేయాల్సిన అవసరాన్ని మరియు విద్యార్థులు అందరూ
అనుకోలా దొరకకపోతే మానసికంగా బలంగా ఉండాలని,విద్యార్థినులు ధైర్యంగా ముందుకు సాగి తమ లక్ష్యాలను సాధించాలని ఆయన ప్రోత్సహించారు. పాలకొల్లు టౌన్ స్టేషన్ వారు కళాశాలలో వ్యాసరచన మరియు వకృత్వ పోటీలు నిర్వహించారు. ప్రధమ ద్వితీయ తృతీయ, పాల్గొన్న వారందరికీ బహుమతులు అందజేశారు. అమరావతిలో నిర్వహించిన
బూట్ క్యాంప్ కి వెళ్ళిన విద్యార్థినిలకు, టైలరింగ్ విద్యార్థినిలకు స్కిల్ కోర్సులలో నైపుణ్యం సాధించిన విద్యార్థినిలకు, ఎన్.సి.సి విద్యార్థినులకు మెమంటో మరియు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు టౌన్ పోలీస్ వారు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి.కృష్ణ ఐ. క్యు. ఎ. సి కోఆర్డినేటర్ కె. భద్రాచలం, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వి. యామిని, స్టూడెంట్ కౌన్సిల్ కన్వీనర్ డాక్టర్ సి.హెచ్. ఉషారాణి,తెలుగు భాష విభాగాధిపతి డాక్టర్ బి.వెంకట స్వామి, ఐ.ఐ.సీ కోఆర్డినేటర్ ఎం. రామకృష్ణ, సూపర్డెంట్ బి లక్ష్మి,మహిళా సాధికారిత కన్వీనర్ బి. కె.వి.రామలక్ష్మి,డాక్టర్ విజయలక్ష్మి వంశీ సుబ్బరాయన్,పి శ్రీనివాస్, వి శిరీష కే శివకృష్ణ. పీ. పార్థసారథి
కళాశాల అధ్యాపకులు, అధ్యాప కేతర సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.