
పాలకొల్లు: ఫిబ్రవరి,12(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం,స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు, అనంతపురం జిల్లా వారి ఆర్థిక సహకారంతో, పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ స్కీంలో భాగంగా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సంస్థ సహకారంతో పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా, కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ వన్, టు, మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో బాలికలకు నిర్వహిస్తున్న ఐదు రోజుల ఏరియల్ డ్రోన్ పైలెట్ ట్రైనింగ్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో నాలుగవ రోజు డ్రోన్ పైలెట్లు, పి దుర్గాప్రసాద్, నరేష్,వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో విద్యార్థినిలకు డ్రోన్ ద్వారా పొలాల్లో స్ప్రే చేసే విధానం పై ప్రాయోగాత్మక శిక్షణ అందించారు. ఈ సందర్భంగా డ్రోన్ నియంత్రణలు, ఎలా పనిచేస్తాయి, స్ప్రే ప్రక్రియను సురక్షితంగా మరియు సమర్థవంతంగా ఎలా నిర్వహించాలి అనే అంశాలను వివరంగా తెలియజేశారు.
అనంతరం ప్రతి విద్యార్థిని స్వయంగా డ్రోన్‌ను నడిపిస్తూ ప్రాక్టీస్ చేయించి, ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై ప్రత్యక్ష అనుభవం కల్పించారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగంపై మెరుగైన అవగాహన పొందారు.డ్రోన్ల వినియోగం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా విపత్తు నిర్వహణ, భూసర్వే, పర్యావరణ పరిరక్షణ, భద్రతా సేవలు, ఫోటోగ్రఫీ మరియు వీడియో గ్రఫీ వంటి అనేక రంగాల్లో విస్తృత అవకాశాలను కల్పిస్తున్నదని నిపుణులు తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతలపై ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు విద్యార్థులకు నూతన ఉపాధి అవకాశాలను పరిచయం చేసి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దుతాయని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీపై ప్రావీణ్యం సంపాదించడం ద్వారా స్వయం ఉపాధి మరియు స్టార్ట్-అప్ అవకాశాలు కూడా పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ, ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్ కె భద్రాచలం, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వి యామిని,తెలుగు విభాగాధిపతి డా. బి. వెంకట స్వామి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. ఎం. రామకృష్ణ, డా. వి.డి.వి. విజయలక్ష్మి, మహిళా సాధికారత విభాగం కన్వీనర్ బి కె వి రామలక్ష్మి,ఎన్ఎస్ఎస్ కమిటీ మెంబర్లు డి మన్మధరావు, డి. హెప్సి రాణి ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.