పాలకొల్లు: మార్చి,2(తెలుగు న్యూస్ పవర్.కాం) స్థానిక అద్ధేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఉన్న అతిపెద్ద 3 తరగతి గదులను విభజించి నిర్మాణం చేస్తారు. ప్రిన్సిపల్ ఛాంబర్ మరమ్మతులు, ప్రహరీ గోడ నిర్మాణం పనుల నిమిత్తం 23.36 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ టి శ్రీ రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. వైస్ ప్రిన్సిపాల్ టి కృష్ణ, కే భద్రాచలం, డాక్టర్ వి యామిని, బూసి వెంకటస్వామి, డాక్టర్ సిహెచ్ ఉషారాణి, డాక్టర్ వి విజయలక్ష్మి, శ్రీనివాస రావు వంశీ సుబ్బరాయం రమేష్ కుమార్ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఏ ఎస్ ఎన్ ఎం కళాశాల అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన.
ఏ ఎస్ ఎన్ ఎం కళాశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల