Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎమ్ కాలేజీ విద్యార్థులు 9 మందికి ఉద్యోగాలు.

ఉద్యోగాలు పొందిన విద్యార్థులతో అధ్యాపకులు

పాలకొల్లు: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల, జేకేసీ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో జీల్ కంపెనీ క్యాంపస్ డ్రైవ్ జరిగింది. ఈ డ్రైవ్‌లో మొత్తం 20 మంది విద్యార్థులు పాల్గొనగా, అందులో 09 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ టి. కృష్ణ హాజరై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు తమ విద్యతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. ఐక్యుఏసీ సమన్వయకర్త శ్రీ కె. భద్రాచలం నాణ్యమైన విద్యతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తమను తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు సూచించారు. అకాడమిక్ కోఆర్డినేటర్ డా. వి. యామిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ప్రోత్సహించారు. జైల్ కంపెనీ కి చెందిన హెచ్‌ఆర్ ప్రతినిధులు వెంకట రమణ, మరియు హేమ భూషణ్ సంస్థ వివరాలు, ఉద్యోగ బాధ్యతలు మరియు అభివృద్ధి అవకాశాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష, ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్యక్రమం ద్వారా విద్యార్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం మరియు ఆలోచనా స్పష్టతను పరీక్షించారు. అనంతరం సాంకేతిక పరిజ్ఞానం మరియు వ్యక్తిత్వ లక్షణాలను ఆధారంగా తీసుకొని తుది ఎంపిక చేసారు.
ఈ కార్యక్రమాన్ని జేకేసీ మెంటర్ శ్రీమతి ఎం.ఎల్.డి. సిరీష , జి.డి. శ్రీనివాసరావు , జి. వేణు మాధురి , రోహిత్ ఫణీంద్ర , దివ్య , శ్రీదేవి , దుర్గేశ్వరి ఇతర అధ్యాపకులు సమన్వయం చేశారు.
కళాశాల యాజమాన్యం ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలను కళాశాలకు ఆహ్వానించి విద్యార్థులకు ఉత్తమ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.