Skip to main content

Telugu News Power

రైల్వే రిజర్వ్ టికెట్ వేరొకరికి ఇవ్వొచ్చు.

న్యూఢిల్లీ: ఫిబ్రవరి27 (తెలుగు న్యూస్ పవర్) భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక వెసులుబాటు ప్రకటించింది. ఒకరి పేరుపై రిజర్వ్ చేసుకున్న టిక్కెట్టును వేరొకరి పేరుకు మార్చడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఇది రక్తసంబంధీకులైన, తల్లిదండ్రులు, సోదర,సోదరి, కొడుకు,కూతురు, భార్యాభర్తలకు కు మాత్రమే మార్చడానికి వీలవుతుంది. ఒకరోజు ముందు రైల్వే రిజర్వేషన్ కార్యాలయానికి వెళ్లి, సంబంధిత రుజులులు సమర్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, వివాహాది శుభకార్యాలకు వెళ్లే బృందాలకు కూడా ఈ సౌకర్యం వర్తింప చేస్తారని రైల్వే శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి విధివిధానాలను ప్రయాణికులకు అందుబాటులోకితేవలసి ఉంది.