
పాలకొల్లు: నవంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) ముఖ్యమంత్రి ముందుచూపుతో వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన యాంత్రికీకరణ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గం,లంకలకోడేరు లో బుధవారం జరిగిన,అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమం లో మంత్రి చరవాణి ద్వారా తన ప్రసంగాన్ని వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు గత ప్రభుత్వం లోఎదురైన సమస్యలు తొలగించిందన్నారు. రైతు కోరుకున్న మిల్లుకే ధాన్యం అమ్ముకోవచ్చు అన్నారు. రైతులకు తమ ఉత్పత్తులు చేర వేసుకోవడానికి రోడ్లు అభివృద్ధి పరిచామన్నారు. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రోడ్లు అభివృద్ధి పరిచామన్నారు. నీటి సరఫరా వ్యవస్థల్ని మెరుగు పరిచామన్నారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి ఇబ్రహీం మాట్లాడుతూ ఇప్పటికీ 30 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇందుకుగాను రైతులకు నాలుగు ఐదు గంటల లోపు డబ్బు చెల్లించామన్నారు. ఈ సీజన్లో 6.17 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు ట్రాన్స్పోర్ట్ చార్జీలు టన్నుకు రూ.3.24పైసలు, గన్ని సంచులకు నాలుగు రూ.4.74 పైసలు చొప్పున చెల్లిస్తామన్నారు. రైతులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ సమస్యలను తెలిసిపరిస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ సభకు పాలకొల్లు మండల తెలుగుదేశం అధ్యక్షులు పాముల రజినికుమార్ స్వాగతం పలికారు. నరసాపురం ఆర్డీవో దాసి రాజు మాట్లాడుతూ, ఏ రకమైన ధాన్యమైన కొంటామన్నారు. రైతులకు ధాన్యం కేంద్రాల వద్ద ఏ సమస్య ఎదురైనా తమకు ఫోన్ ద్వారా తెలిపితే వెంటనే ఆ సమస్యనుపరిష్కారం చేస్తామన్నారు. ఈ సందర్భంగా సభలో రైతుల సందేహాలు కు ఆర్డిఓ ఆర్టీవో సమాధానం ఇచ్చారు. ఎమ్మార్వో దుర్గా కిషోర్ మాట్లాడుతూ ట్రక్ షీట్ వచ్చిన మూడు గంటల లోపు ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరితే ఏ విధమైన ఇబ్బందులు ఉండవు అన్నారు. రాత్రిపూట ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దిగుమతి ఉండని కారణంగా రైతులు కొనుగోలు కేంద్రాలకు వెలితే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. వ్యవసాయ అధికారి ఏ.డి. మురళీకృష్ణ మాట్లాడుతూ సన్న రకానికి 89 రూపాయలు, లావు రకానికి 69 రూపాయలు ఈ సీజన్లో అధికంగా మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు.
జనసేన నాయకులు తులా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ, పౌరసరఫరాల శాఖ 50 వేల టార్పాలను 19,000 మంది రైతులకు ఉచితంగా పంచడానికి సిద్ధం చేసిందని వెల్లడించారు. ఈ సభలో ఆర్డిఓ దాసిరాజు 13 వేల మందికి 9 46 కోట్ల రూపాయల అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కును సభలో అందజేశారు. ఈ సభలో నియోజకవర్గ ఇన్చార్జ్ తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళీశ్వరరావు,మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షు బోనం నాని, దాసరి రత్నం రాజు పాలవలస తులసీ రావు, ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి జెడ్పిటిసి నడపన గోవిందరాజులు నాయుడు, కూటమి నాయకులు, పలువురు రైతులు హాజరయ్యారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నర్సాపురం ఆర్డీవో దాసిరాజు బుధవారం లంకలకోడేరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పచ్చ జెండా ఊపుగా ఆయన స్వయంగా ట్రాక్టర్ ను లోడుతూ ముందుకు నడిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఇబ్రహీం పాలకొల్లు ఎమ్మార్వో ఎడ్ల దుర్గా కిషోర్, వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఇంచార్జ్ పెచ్చెట్టి చంద్రమౌళీశ్వర రావు, అంగర రామ్మోహన్ రావు పలువురు రైతు నాయకులు ,రైతులు పాల్గొన్నారు.
