పాలకొల్లు: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పేపర్) ఈ ఏడాది నిర్వహించనున్న, ఏపీ ఐసెట్, పీజీ సెట్, రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారి కోసం, స్థానిక ఛాంబర్స్ కళాశాలలో, సేవా కేంద్రం ఏర్పాటు చేశారు. ఆన్ లైన్లో చేసే,ఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. ఐసెట్ ఫీజు 750, పీజీ సెట్ 850 రూపాయలు అభ్యర్థులు ఆన్లైన్లో చెల్లించాలి. కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వివరాలకు, 9912046234,7989908776 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలి. పాలకొల్లు పరిసర ప్రాంతాల అభ్యర్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని చాంబర్స్ కళాశాల అధ్యక్షులు కెవిఆర్ నరసింహారావు కోరారు.