Telugu News Power

కనుల పండుగగా శ్రీవారి కల్యాణోత్సవం.

శ్రీవారి కల్యాణోత్సవం

పాలకొల్లు:డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్) ఉభయ గోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ విగ్రహాలతో శనివారం రాత్రి ఆర్ఆర్ రైస్ మిల్ ప్రాంగణంలో ఈ ఉత్సవం జరిగింది. తిరుపతి నుంచి వచ్చిన పండితులు, ఇతర ప్రముఖ అర్చకులు ఈ కళ్యాణం ఉత్సవం వైభవంగా జరిపించారు.ఈ కళ్యాణోత్సవంలో కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు దంపతులు, కాటంరెడ్డి సత్యనారాయణ దంపతులు జరిపించారు. ఈ సందర్భంగా ఉదయం దేవరపల్లి రామకృష్ణ దంపతులచే గణపతి హోమం జరిపించారు. కాటంరెడ్డి సత్యనారాయణ దంపతులు, నంబూరి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో సామూహిక శ్రీ చక్ర పూజ జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ కళ్యాణోత్సవం లో వేలమంది భక్తులు పాల్గొని,చూసి తరించారు. ప్రత్యక్షంగా ఈ దివ్య కళ్యాణం తిలకించడంలో భక్తులు పులకించిపోయారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అల్పాహార ప్రసాదం, తిరుపతి ప్రసాదాలు వితరణ చేశారు. భక్తులకు తిరునామం తిలకం దిద్దటం ఈ కార్యక్రమానికి మరింత శోభ తెచ్చింది. భారీ గుడారం ఏర్పాటు, భక్తులకు చలి, మంచు నుంచి రక్షణ కల్పించింది. ఈ కార్యక్రమంలో గురు స్వామి యాదంరెడ్డి సత్యం, మేడికొండ శ్రీనివాస్, కటారి నాగేంద్ర కుమార్, కలిదిండి కృష్ణ వర్మ, కాటంరెడ్డి సత్యనారాయణ, గాదంశెట్టి సతీష్, తదితర కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. తిరుపతి ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు మేకా శేషుబాబు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు బీరక ప్రసాద్, ఆర్ఆర్ రైస్ మిల్ అధినేత భూపతిరాజు రాజు, సోమరాజు, తటవర్తి కృష్ణమూర్తి, , తోట ఈశ్వర్,మారెళ్ళ మాణిక్యాలరావు తదితరులు, గోవింద మాల కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

శ్రీ చక్ర పూజలో పాల్గొన్న మహిళాభక్తులు.