Telugu News Power

కలెక్టర్ గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ నాగరాణి
విద్యార్థుల ప్రగతి పై ఆరా తీస్తున్న కలెక్టర్ నాగరాణి

 

పాలకొల్లు: నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం సాయంత్రం పాలకొల్లు బ్రాడీపేట బైపాస్ రోడ్లు గల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ చేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల విద్యార్థులతో ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు మంచినీటి సమస్య,వసతి భవనం సరిపోకపోవడం, ఆట స్థలం లేకపోవడం వంటి సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని స్వయంగా విద్యార్థులతో కలిసి కూర్చుని భోంచేసి తెలుసుకున్నారు. చదువుల్లో కూడా విద్యార్థులు శ్రద్ధ కనబరుస్తున్నారని గమనించారు. కలెక్టర్ పర్యటన సంతృప్తికరంగా ముగిసింది. కలెక్టర్ ఈ పాఠశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ మండల విద్యాశాఖ అధికారులు గుమ్మల వీరాస్వామి, ఆర్ వి ఎస్ గంగాధర్ శర్మ، పాఠశాల ప్రిన్సిపాల్ జి.సూర్య కుమారి, ఉపాధ్యాయులు వారి సిబ్బంది పాల్గొన్నారు.
గతంలో ఈ పాఠశాల యలమంచిలి మండలం కట్టుపాలెం తరలించిన సందర్భంగా, అసౌకర్యం వల్ల, వివాదం చెల్లరేగి విద్యార్థులు ఉద్యమించారు. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు జోక్యంతో ఆ వివాదం సద్దుమణిగింది. పాలకొల్లు లో ఉన్న పూర్వ భవనంలోకి మంత్రి ఆదేశాల మేరకు తరలించారు.

 

కలెక్టర్ నేల పై కూర్చుని విద్యార్థులతో సహపంక్తి భోజనం.