Skip to main content

Telugu News Power

విజిలెన్స్ అధికారులు తనిఖీ

పాలకొల్లు:నవంబర్,21 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు మున్సిపాలిటీ పరిధిలో గల బంగారు చెరువు గట్టు పనులను విజిలెన్స్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ నిధులనుండి వాకింగ్ ట్రాక్, పార్క్ నిర్మాణం కోసం పనులు గతంలో చేపట్టారు. అయితే న్యాయ సమస్యల వల్ల ఆ పనులు నిలిపివేయవలసి వచ్చినట్లు తెలిసింది. అప్పటి నుంచి పనులు ముందుకు సాగటం లేదు. దీనిపై విజిలెన్స్ అధికారులు పనులకు సంబంధించి వివరాలు అధికారుల నుంచి సేకరించారు. పనుల తీరు, నాణ్యత కొలతలతో సహా తీసుకున్నారు. త్వరలో దీనిపై నివేదిక ఇవ్వవలసిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అయితే ఈ పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదు అంటున్నారు. అది ప్రభుత్వ విధానంపై ఆధారపడి ఉంటుందన్నారు.