
పాలకొల్లు; మార్చి, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) సొంత ఇంటి కల నిజం చేసి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు లబ్ధిదారులకు తాళాలు అందించడంతో సోమవారం టిడ్కో ఇళ్ల సముదాయంలో తిరునాళ్లను మరిపించింది. ఈ గృహప్రవేశ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా కోలాహలంగా కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, ఆనాడు, కేంద్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్ల 6,140 గృహాల నిర్మాణం కోసం మంజూరు అయ్యాయని వెల్లడించారు. తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల కు మాత్రమే అమృత పథకంలో ఇల్లు మంజూరు అయ్యాయఅన్నారు. అమృత పథకంలో లేని పాలకొల్లు కూడా ఇల్లు మంజూరు కావడం విశేషం అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సరవేగంతో పనులు జరిగి వివిధ దశలో పూర్తయ్యాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులన్నీ మూలం పడ్డాయన్నారు. టిడిపి కట్టిన ఇళ్లపై వైసిపి ప్రభుత్వం వారు అప్పులు తెచ్చుకున్నారని ఆరోపించారు. ఇందుకోసం, పట్టణంలో నిరసన కార్యక్రమాలు నిరాహార దీక్షలు పోస్ట్ కార్డు ఉద్యమం నడిపించినట్టు గుర్తు చేశారు. సుమారు 220 కిలోమీటర్ల సైకిల్ యాత్ర అమరావతి వరకు చేశానన్నారు. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016 ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. మిగిలిన ఇల్లు కూడా ఈ ఏడాదిలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఈ గృహప్రవేశ వేడుకలను, ఇంటి ఆడపడుచులకు ఇచ్చే సాంప్రదాయ గౌరవంతో, పసుపు కుంకుమ, గాజులు,చీర, రవిక పెద్దదారులు మహిళలకు అందిస్తున్నామని తెలిపారు. సామూహిక శాపంతి భోజనాలు కుటుంబ సభ్యులందరికీ ఏర్పాటు చేసామన్నారు. ఈ సందర్భంగా, ముఖ్యఅతిథిగా హాజరైన, స్థానిక ఎంపీ కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖామాత్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏకైక పనిమంతుడు, నెంబర్ వన్ స్థానంలో ఉన్న స్థానిక శాసనసభ్యులు, జల వనరులశాఖామాత్యులు నిమ్మల రామానాయుడు తో ఎవరు పోటీ పడలేరని సాక్షాత్తు రాష్ట్రముతున్నది చంద్రబాబు నాయుడు తెలిపారు అన్నారు.్ నిరంతర శ్రమతో, ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే నాయకుడు నిమ్మల రామానాయుడు అని కొనియాడారు. ఇలాంటి నాయకుడే కావాలని ఇక్కడ కోరుకున్న ప్రజలను కేంద్ర మంత్రి అభినందించారు. జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి ముఖ్యమంత్రి సందేశాన్ని లబ్ధిదారులకు తెలియజేశారు. సొంత ఇంటి కోరిక నెరవేరడం వల్ల లబ్ధిదారుల ఆత్మస్థైర్యం, అభివృద్ధి, పిల్లల చదువులకు ఎంతగానో సహకరిస్తుందని వెల్లడించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమాన్ని రామానాయుడు అన్నీ తానై నిర్వహించారు. గృహ ప్రవేశానికి హాజరైన వారికి శీతల పానీయాలు అందించారు. లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. స్వయంగా మంత్రి భోజనం ప్లేట్లు తీసి డస్ట్ బిన్ లో వేశారు. గృహ సముదాయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని, కేంద్ర మంత్రి వర్మ, కలెక్టర్ నాగరాణి తో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో, ఆర్టీవో దాసిరాజు, వై దుర్గా కిషోర్, మున్సిపల్ కమిషనర్ విజయ.సారధి, గృహ నిర్మాణ శాఖ అధికారులు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, కర్నేని రోజా రమణి, గౌరు నాయుడు, గొట్టుముక్కలు సూర్యనారాయణ రాజు,రుద్ర సత్యనారాయణ రాజు, బొప్పన హరికి కిషోర్, చిలుకూరు బాలాజీ, గోపి,మహమ్మద్ జానీ,జనసేన నాయకులు బోనం చినబాబు, తులా రామలింగేశ్వర రావు, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి, కొల్లి కొండ ప్రసాద్, ఎర్రం శెట్టి పద్మారావు, జక్కంపూడి కుమార్, అల్లూరి పద్మ వర్మ, తదితరులు పాల్గొన్నారు.