Telugu News Power

కళాక్షేత్రానికి 8 కోట్లు -మంత్రి నిమ్మల వెల్లడి.

మంత్రి నిమ్మలను సత్కరిస్తున్న పాలకొల్లు కళాపరిషత్

పాలకొల్లు: మార్చి, 15(తెలుగు న్యూస్ పవర్.కామ్) నిర్మాణంలో ఉన్న నందమూరి- బొండాడ కళాక్షేత్రానికి 8 కోట్ల రూపాయలు నిధులు మంజూరైనట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లు కళా పరిషత్తు ఆధ్వర్యంలో 3రోజులపాటు జరిగిన నాటిక పరిషత్తు ముగింపు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా ఆదివారం రాత్రి హాజరయ్యారు. ఈ సభకు కళాపరిషత్ అధ్యక్షులు కే.వి.కృష్ణ వర్మ అధ్యక్షత వహించారు. బిజెపి నాయకులు జక్కంపూడి కుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ కళాక్షేత్రం పనులు పరిశీలించినట్లు తెలిపారు. కళాకారులకు సర్వ భూములతో ఈ కళాక్షేత్రం నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడ కళాకారులు రిహార్సల్స్,ఉండటానికి గదులతో సహా అన్ని సౌకర్యాలు నామమాత్రపు ధరకు అందుబాటులో ఉంటాయన్నారు. తనకు వ్యక్తిగతంగా కలలపై ఎంతో అభిమానం ఉందన్నారు. ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ ప్రాంతం సుభిక్షంగా విరాజిల్లుతుందన్నారు. శ్రీకృష్ణదేవరాయల వంటి కళాభిమానులు ఎందుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా మంత్రి పలువురిని సత్కరించారు. అధ్యక్షులు కృష్ణ వర్మ మాట్లాడుతూ,మారుతున్న సమాజ తీరుతతో కళారూపాల్లో మార్పులు వల్ల ఈరోజు నాటకం రంగం కొంత వెనకబడిందన్నారు. ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిన కూడా ఈరోజు గొప్ప కళాకారులు అందరికీ నాటక పరిషత్తులే మూలం అన్నారు. ఈ సభలో కళాపరిషత్తుల నిర్వాహకులు రాయప్రోలు భగవాన్ అయ్యప్ప నాడు లను ఘనంగా సత్కరించారు. కళాపరిషత్ నిర్వహణకు సౌజన్యం అందిస్తున్న కళాఅభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడికొండ శ్రీనివాస్, మహానాపురం సత్యనారాయణ, విఠపు రమణ, కొనిజేటి గుప్త, జీ ఎస్ ఎన్ రవి, వంగా నరసింహారావు, చేగొండి సత్యనారాయణమూర్తి, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, గండేటి వెంకటేశ్వరరావు, పిచ్చెట్టి బాబు, పాలవలస తులసీరావ్ తదితరులు పాల్గొన్నారు. ఒక రోజు ప్రదర్శించిన నాటికలు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సమస్యలను ఎత్తిచూపాయి. మహిళలపై లైంగిక దాడులు, ట్రాన్స్ జెండర్ లగా మారే బిడ్డల పట్ల తల్లి ఆవేదన, తల్లిదండ్రుల పట్ల ఎదిగిన సంతానం చూపుతున్న నిర్లక్ష్యం గురించి ఈ నాటికల్లో ప్రస్తావించారు. ప్రేక్షకుల అభినందనలు ఈ నాటికలు అందుకున్నాయి.