
పాలకొల్లు: మార్చి, 13 (తెలుగు న్యూస్ పవర్. కాం) గత 75 ఏళ్లుగా పాలకొల్లు పట్టణంలో నాటక పరిషత్ లు నిర్వహించడానికి, కళాభిమానులు, దాతల ప్రోత్సాహమే కారణమని, పాలకొల్లు కళా పరిషత్ అధ్యక్షులు, మాంటిసోరి విద్యాసంస్థల అధినేత, కె.వి.కృష్ణ వర్మ పేర్కొన్నారు. పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 17వ జాతీయస్థాయి నాటిక పోటీలు శుక్రవారం రాత్రి రాయప్రోలు భగవాన్ ప్రారంభించారు. జక్కంపూడి కుమార్ సభకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, ఈ బిజీ లైఫ్ లో ఏ కార్యక్రమం చేపట్టడానికి అయినా సమయం దొరకడం లేదన్నారు. ప్రతివారు సూక్ష్మంలో మోక్షం వెతుక్కుంటున్నారు తప్ప, ఎవరికి ఓపీకగా ఉండటం లేదన్నారు. ఇలాంటి కష్ట సమయంలో కూడా, గత 75 ఏళ్లుగా నాటక పరిషత్తు లు పాలకొల్లు లో నిర్వహించడం ఎంతో అదృష్టం అన్నారు. ఇందుకు కారణం, కళాభిమానులు ఉండటం, దాతల ప్రోత్సాహం, అన్నిటికంటే మించి, ఇక్కడ కొలువై ఉన్న,ఆ మహాదేవుని ఆశీర్వచనం కారణమన్నారు. చాలా చోట్ల నాటక పరిషత్తులు నిర్వహించినప్పటికీ, ఇంత సుదీర్ఘకాలం విజయవంతంగా నిర్వహించడం నాటక పరిషత్ చరిత్రలో లేదన్నారు. ప్రోత్సహిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సినీ నటులు సారిక రామచంద్రరావు మాట్లాడుతూ, నాటక పరిషత్తులకు ఘనమైన వేదిక ఏర్పాటు చేయాలని కోరారు. పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ ఇంచార్జ్ గుణాల హరి గోపాల్ రావు,గోపి మాట్లాడుతూ, పాలకొల్లు కళలకు పుట్టిల్లనీ, కలలు కాపాడుకోవడానికి పాలకొల్లు కళాపరిషత్తు వారు చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేడికొండ శ్రీనివాసరావు, వంగా నరసింహారావు, యడ్ల తాతాజీ, జిమ్ము వాసు, కోరాడ శ్రీనివాస్,మానాపురం సత్యనారాయణ, చిలుకూరి రాఘవేంద్ర కుమార్, వర్మ, విటాకుల రమణ, దాసరి నాని, రెడ్డి వాసు, కొణిజేటి గుప్తా, షేక్ పి సాహెబ్, అంగర వీరభద్ర కుమార్, సోమంచి శ్రీనివాస శాస్త్రి, నడపన శ్రీనివాస్, కొల్లి కొండ ప్రసాద్, జిఎస్ఎన్ ఆర్ట్స్ రవి, శ్రీనివాస హోటల్ అధినేత దేవి రెడ్డి శ్రీనివాస్, ఆనంద సాయి అధినేత గోవిందరాజులు, శ్రీ కన్య హోటల్ అధినేత రాజు, పలువురు కళాభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన, “దేవున్ని చూశాను”,”మంచి మనసులు”నాటికలు ప్రేక్షలను ఆకట్టుకున్నా యి.