పాలకొల్లు:డిసెంబర్,23 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాలలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ ప్రేమ,శాంతి,క్షమాగుణాల సమాహారం అన్నారు. ఏసుక్రీస్తు బోధనలు సేవాభావం, క్షమాగుణం, మానవత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కోసి, క్యాండిల్ సర్వీస్ నిర్వహించారు. విద్యార్థులు క్రిస్మస్ కోరల్స్ ఆలపించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో టి కృష్ణ, కే భద్రాచలం, వి యామిని, ఎం రామకృష్ణ, వి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కళాశాలలో క్రిస్మస్ వేడుకలు
ఏ ఎస్ ఎన్ ఎమ్ కళాశాలలో క్రిస్మస్ వేడుకలు