Telugu News Power

కళ్యాణోత్సవాలపై భక్తులతో సమావేశం.

అభిషేక మందిరంలో సమావేశం నిర్వహిస్తున్న చైర్మన్, ఈఓ, మీసాల రాము శ్రీనివాసరావు

పాలకొల్లు: మార్చి, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ శీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వారు ఈ నెల 26 నుంచి సప్తాహ్నిహ్నక కళ్యాణ్ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల శ్రీనివాసరావు, స్థానిక అభిషేక మనకు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భక్తులు ఇచ్చిన విలువైన సూచనలను, ఉత్సవాలకు ఉత్సవాల సందర్భంగా పరిగణలోకి తీసుకుంటామని చైర్మన్, ఈవో తెలిపారు. శ్రీ పార్వతీ సమేత శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వార్లు, శ్రీ లక్ష్మీ సమేత శ్రీ జనార్ధన స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాలు ఈనెల 27 నుంచి, వచ్చే నెల 2 వరకు జరుగుతాయని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవంలో శాఖామాత్యులు, నిమ్మ రామానాయుడు, సూర్యకుమారి దంపతులచే స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభిస్తారు. శ్రీ విఘ్నేశ్వర పూజ, అంకురార్పణ, గజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, బలిహరణ ఈ నెల 27 సాయంత్రం 6 గంటలకు ఈ పూజలు ప్రారంభిస్తారు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు నీరాజన మంత్రపుష్ప, తీర్థ ప్రసాదముల వినియోగం జరుగుతుందని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు క్రిష్టప్ప, అనిల్, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పెండ్యాల భవాని, తదితరులు హాజరయ్యారు.