Telugu News Power

కాపు విద్యార్థులకు స్కాలర్షిప్

విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తున్న డేగల సూర్యప్రభ వెంకటేశ్వరరావు దంపతులు

పాలకొల్లు: ఫిబ్రవరి, 8(తెలుగు న్యూస్ పవర్) ప్రతిభ గల పేద కాపు విద్యార్థులకు, ఉపకారవేతనాలు అందజేస్తున్న తులసీ రామచంద్ర ప్రభు ను, స్థానిక మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యులు, లయన్స్ క్లబ్ స్థాపకులు, త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, డాక్టర్ బాబ్జి కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు. స్థానిక లయన్స్ క్లబ్ హాల్లో ఆదివారం స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సీఐ కే. రజనీ కుమార్ మాట్లాడుతూ, ప్రతిభకు, పేదరికం అడ్డు కాదన్నారు. విద్యార్థులు ఈ స్కాలర్షిప్ సద్వినియోగం చేసుకొని, పట్టుదలతో చదివి, జీవితంలో పైకి రావాలని ఆకాంక్షించారు. ప్రముఖ విత్తన సంస్థ, తులసి సీడ్స్, అధినేత తులసి రామచంద్ర ప్రభు, ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీకృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ ప్రివిలేజ్డ్ ట్రస్ట్, గుంటూరు వారు ఈ స్కాలర్షిప్ లు, ప్రతి ఏట అందజేస్తున్నారు.

స్థానిక నియోజకవర్గపరిధిలో 330 మంది విద్యార్థులు స్కాలర్షిప్ అందుకున్నారు. ఇందుకుగాను, ట్రస్ట్ 14 లక్షల రూపాయల విరాళం ఇచ్చింది. పట్టణ కాపు నాయకులు, వంగా నరసింహారావు, ముచ్చర్ల శ్రీరామ్, సిహెచ్ సూర్య నరేష్, చేగొండి రంగారావు, ఎర్రంశెట్టి వెంకటరత్నం కృషిచేసి,ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమంలో కొట్టు భాస్కరరావు, ఎంపీటీసీ డేగల సూర్యప్రభ వెంకటేశ్వరరావు దంపతులు, తదితరులు పాల్గొన్నారు.