పాలకొల్లు: జనవరి,2 (తెలుగు న్యూస్ పవర్) తులసి సీడ్స్ అధినేత, కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ ప్రివిలేజ్డ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తులసి రామచంద్ర ప్రభు, గుంటూరు వారి సౌజన్యంతో కాపు విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఏట అందిస్తున్నారు. ఈ ఏడాది, విద్యార్థుల నుంచి ఇందుకుగాను దరఖాస్తులు కోరుతున్నారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు, తెలగ, బలిజ సంక్షేమ సంఘం, స్థానిక కాపు కార్తీక్ వన సమారాధన కమిటీల ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ల ఎంపిక జరుగుతుంది. విద్యార్థులు 75శాతం మార్కులతో పాటు, ఆర్థిక పరిస్థితి కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు, ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పొందవచ్చు. స్థానిక నియోజకవర్గ పరిధిలో ఉన్న కాపు, తెలగా,బలిజ విద్యార్థులు ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నెంబర్ వారి నుంచి దరఖాస్తులు పొందవచ్చునని స్థానిక కాపు సంఘ కన్వీనర్ మంగా నరసింహారావు (9912243612)తెలిపారు. ఇంకా, స్థానిక రైల్వేగేటు వద్దగల, చవాకుల చారిటబుల్ ట్రస్ట్, అధినేత సూర్య నరేష్ బాబు, 9494337711, ముచ్చర్ల శ్రీరామ్, 9494337012, స్థానిక గాంధీ బొమ్మల సెంటర్, కార్యాలయం నుంచి దరఖాస్తులు పొందవచ్చు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వచ్చేనెల 8వ తేదీ ఈ స్కాలర్షిప్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వంగా నరసింహారావు వివరించారు.