Telugu News Power

కార్మిక మంత్రి కాపవరం పర్యటన.

పాలకొల్లు: మార్చి, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ శనివారం స్థానిక కాపవరం గ్రామంలో పర్యటించారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, అంగర రామ్మోహన్రావు స్వగ్రామంలో నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవ సందర్భంగా, మంత్రి సుభాష్ విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ,టిడిపి రాష్ట్ర కార్యదర్శి, పెచ్చెట్టి బాబు, సర్పంచ్ కోలాటి రాధా, అంగర చిన్న, గూడూరి శ్రీరామ్మూర్తి తదితర గ్రామ పెద్దలు సుభాష్ కు స్వాగతం పలికారు.

 

మంత్రి సుభాష్ కు స్వాగతం పలుకుతున్న అంగర, బాబు

స్థానిక రామాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న, మాజీ, తాజా ఎమ్మెల్సీలు,అంగర,, కౌరు శ్రీనివాస్, పాలకొల్లు వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ గుడాల గోపి