Telugu News Power

కాశి, అహ్మదాబాద్ కు కొత్త రైళ్లు నడపాలి.

డిఆర్ఎం కు వినతి పత్రం అందజేస్తున్న జక్కంపూడి కుమార్

విజయవాడ/పాలకొల్లు: జనవరి, 23(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు నుంచి నేరుగా కాశి, అహ్మదాబాదులకు కొత్తగా రైళ్లు నడపాలని, దక్షిణ మధ్య రైల్వే, డి ఆర్ యు సి సి సభ్యులు జక్కంపూడి కుమార్ విజ్ఞప్తి చేశారు. విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన, 134 డి ఆర్ యు సి సి సమావేశాల్లో కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా, పలు అంశాలతో కూడిన వినతిపత్రం డివిజనల్ మేనేజర్ కు సమర్పించారు. ఎంతో కాలంగా, పాలకొల్లు ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న కాశి, అహ్మదాబాద్ కు నేరుగా రైలు నడపాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వారాల వారీగా నడుస్తున్న రైళ్లు రోజువారి నడపాలని విజ్ఞప్తి చేశారు. గతంలో నడిపిన, నరసాపురం-విశాఖపట్నం, భీమవరం-రాజమండ్రి రైళ్ళు వెంటనే పునరుద్ధరించాలని కోరారు. బెంగళూరు, తిరు అన్నామలై రైళ్ళు ప్రతిరోజు నడపాలని విజ్ఞప్తి చేశారు. పాలకొల్లు రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈశాన్య ద్వారం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పాలకొల్లు స్టేషన్లో, పార్కింగ్, షెల్టర్ సౌకర్యాలు పెంచాలని కోరారు. రైల్వే ఫిర్యాదుల ఫోన్ నెంబర్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. వందే భారత్ రైలు, నరసాపురం వరకు పొడిగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణికుల, అవసరాలకు సంబంధించి పలు సూచనలతో కూడిన వినతిపత్రంపై, కేంద్రమంత్రి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ద్వారా రైల్వే మంత్రితో సంప్రదించి, పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ సమావేశం డి ఆర్ యు సి సి, నర్సాపురం సభ్యులు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.