Telugu News Power

కృత్రిమ మేధా సదస్సుకు అమలాపురం వాసులకు ఆహ్వానం.

ఆహ్వానం అనుకున్న శాస్త్రవేత్తలు,

అమలాపురం: ఫిబ్రవరి, 6(తెలుగు న్యూస్ పవర్) దేశ రాజధాని, ఢిల్లీలో నిర్వహించనున్న, కృత్రిమ మేధా, శిఖరాగ్ర సమావేశానికి, అమలాపురం శాస్త్రవేత్తలకు ఆహ్వానం అందింది. “ఇండియా ఏ ఐ ఇంపాక్ట్-2026′, ఈ నెల19-20 వరకు జరుగుతుంది. ఈ సదస్సులో, కృత్రిమ మేధకు సంబంధించి, పరిణామక్రమాన్ని, భవిష్యత్తును చర్చిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ, బిల్ గేట్స్, సుందర్ పిచ్చాయ్, ముఖేష్ అంబానీ, వివిధ దేశాల నుంచి వందకు పైగా గ్లోబల్ సీఈఓ లు, సీటీవోలు ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. కృత్రిమ మేధా, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో అనువర్తిత విజ్ఞానం, ఆలోచనాత్మక నాయకత్వంతో, కర్ర సంతోష్ శాస్త్రి గుర్తింపు పొందారు. శ్రీ లలిత కూడా ఈ వేదికపై చోటు దక్కించుకున్నారు. ఏఐ రంగంలో వీరికి ఉన్న ప్రాధాన్యతను అనుసరించి ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందుకున్న వీరిని పలువురు అభినందించారు.