Telugu News Power

కేంద్ర మంత్రి అమిత్ షా కు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు.

అమిత్ షా తో పవన్ కళ్యాణ్ భేటీ

న్యూఢిల్లీ: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఉప్పాడ తీర ప్రాంత ప్రజల రక్షణ కోసం, ఉప్పాడ లో నిర్మించదలచిన గోడ నిర్మాణానికి, అనుమతి మంజూరు చేసినందుకు, కేంద్ర హోం శాఖ మాత్యులు అమిత్ షాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఢిల్లీ పర్యటనలో భాగంగా వారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర తాజా రాజకీయాల గురించి వారిరువురూ చర్చించుకున్నారు. పరిపాలనకు సంబంధించి،ముఖ్య విషయాలపై మాట్లాడారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని, నేటి రాత్రి విశాఖ చేరుకోనున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తన ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.