Telugu News Power

కొత్త ఏడాదికి స్వాగతం పలికిన వాకర్స్ క్లబ్.

మారథాన్ పరుగుల రాణిని సత్కరిస్తున్న క్లబ్ సభ్యులు.

పాలకొల్లు: డిసెంబర్,31(తెలుగు న్యూస్ పవర్) కొత్త ఆలోచనలతో పురోగమించడానికి నూతన సంవత్సర ఒక అవకాశం గా తీసుకోవాలని, క్లబ్ అధ్యక్షులు తటవర్తి సుధాకర రావు తీర్మానించారు. స్థానిక వాకర్స్ క్లబ్, కొత్త కుళాయి చెరువు గట్టు వద్ద బుధవారం నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేడియాలజిస్ట్, డాక్టర్ పవన్ కుమార్, నడక పరుగు వంటి వ్యాయామాల వల్ల శరీరంలో ఎండార్పిన్, హ్యాపీ హార్మోన్ విడుదలై, ఆరోగ్యంగా జీవించవచ్చునన్నారు. కేక్ కటింగ్ ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మారథాన్ పరుగులో రాణిస్తున్న ముగ్గురిని, క్లబ్ వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో, కార్యదర్శి, షేక్ పీర్ సాహెబ్,కోశాధికారి, పోతుల ఉమా శంకర్ రావు, ఉపాధ్యక్షులు మానెం బాసవ రాజ,
పూర్వ గవర్నర్లు,ఆకి రామకృష్ణ, జి వి సుబ్బారావు, , సలాది రామచంద్రరావు, ధనాని శ్రీరామమూర్తి, జవ్వాజి కళ్యాణ్, నంబూరి గంగ పవన్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మిఠాయిలు, అల్పాహారం ఏర్పాటు చేశారు.

నూతన సంవత్సర వేడుకల్లో క్లబ్ సభ్యులు