న్యూఢిల్లీ: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పామాయిల్ మిల్లులను ఆధునీకరించాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పార్లమెంట్లో డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోనే అత్యధిక పామ్ ఆయిల్ సాగు విస్తీర్ణం కలిగి ఉందన్నారు. ఈ పంట సుమారు 2.49 లక్షల హెక్టార్ల సాగవుతుందని తెలిపారు.
దాదాపు 1.97 లక్షల మంది రైతులకు జీవనాధారంగా ఉందన్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పామ్ ఆయిల్ పంట దేశీయ ఉత్పత్తి పెంపు, దిగుమతుల తగ్గింపు లక్ష్యంగా జాతీయ వంటనూనెల పథకం ద్వారా పామాయిల్ సాగును కేంద్ర ప్రభుత్వం
ప్రోత్సహింసస్తున్నది.
ప్రతి సంవత్సరం భారత్ వాడే వంటనూనెల దిగుమతులపై 70వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నది. ఈ నేపథ్యంలో,
దేశీయ ఉత్పత్తిని పెంచడం అత్యవసరం కాగా, రైతు ఆదాయానికి ఎంతో అవసరమైనదని పురందరేశ్వరి పార్లమెంట్ దిగువ సభ దృష్టికి తెచ్చారు. కాలం చెల్లిన మిల్లు వల్ల, కేవలం ఒక శాతం నూనె తీసే నిష్పత్తి తగ్గినా
టన్నుకు పది కిలోల దిగుబడి రైతులు నష్టపోతున్నారని ఎంపీ వివరించారు. ఇది రైతుల ఆదాయాన్ని నేరుగా భారీగా గండి కొడుతుందన్నారు. అనేక సహకార, ప్రభుత్వ నూనె మిల్లులు ఇప్పటికీ కూడా
పాతబడిన బ్యాచ్ ప్రాసెసింగ్ యంత్రాలతో ఆడించడం వల్ల నూనె దిగుబడిలో గణనీయమైన నష్టం జరుగుతోందన్నారు. ఎన్ ఎం ఈ ఓ- ఓపి పథకం ద్వారా
లక్ష్యిత ఆర్థిక, సాంకేతిక సహాయం అందించాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పామ్ ఆయిల్ మిల్లులను సమగ్రంగా ఆధునికీకరించాలని కోరారు.
ఉత్పత్తి సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి పెంచి
రైతుల ఆదాయానికి నష్టం లేకుండా చూడాలన్నారు.
ఈ మార్పులు భారత్‌ను వంట నూనెలలో స్వావలంబన దిశగా వేగంగా ముందుకు తీసుకెళ్తాయని ఎంపీ పురందరేశ్వరి సభకు సూచించారు