Telugu News Power

కొలువుదీరిన, కొత్త ఆర్టిఐ కమిషనర్ లు

అమరావతి: జనవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర ప్రభుత్వం, నియమించిన ఆర్టిఐ కమిషనర్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఆదివారం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రధాన సమాచార కమిషనర్ గా, ప్రముఖ అడ్వకేట్, వజ్జా శ్రీనివాసరావు, వట్టికూటి శరత్చంద్ర కళ్యాణ చక్రవర్తి, గాజుల ఆదెన్న, ఒంటేరు రవిబాబు, పరవాడ సింహాచలం నాయుడు కమిషనర్లు గా నియమితులయ్యారు. వీరి చేత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కె విజయయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరు మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. జనసేన పార్టీకి, చెందిన వట్టికూటి శరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తి, వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో, ఒకటో బ్లాక్ లో ప్రమాణ స్వీకారం చేశారు. వీరు జనసేన పార్టీ మీడియా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వీరు జర్నలిస్టుగా పనిచేసారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు వారిని అభినందించారు.