Telugu News Power

క్రిస్మస్ వేడుకలు ప్రారంభం

దేవుని తోటలో క్రిస్మస్ ఆరాధన

పాలకొల్లు:డిసెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు పట్టణంలో క్రిస్మస్ సందర్భంగా ముందు రోజు నుంచే చర్చిలు విద్యుత్ దీపకాంతులతో ఆకట్టుకున్నాయి.ఆరాధనలు, ఊరేగింపులు, బాలల నృత్యాలు, క్రిస్మస్ గీతాలు ఆలాపన, సువార్త వాక్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వైభవంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలుచోట్ల క్రిస్మస్ కూటములు జరిగాయి. క్రైస్తవ భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రభువును ఆరాధించారు. దేవుని తోటలో నాళం గుప్త,హౌస్ ఆఫ్ ప్రేయర్ ఆధ్వర్యంలో తన పుట్టినరోజు కార్యక్రమం వేడుకల సందర్భంగా జరిగిన క్రైస్తవారాధన కార్యక్రమంలో దైవజనులు విశేషంగా పాల్గొన్నారు.