Skip to main content

Telugu News Power

వాకర్స్ క్లబ్ ఆర్థిక సహాయం

సహాయం అందిస్తున్న వాకర్స్ క్లబ్ సభ్యులు

పాలకొల్లు:డిసెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక వాకర్స్ క్లబ్ వారు పేద విద్యార్థులకు బుధవారం ఆర్థిక సహాయం అందించారు. స్థానిక డిఎన్ఆర్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు విశ్వనాథం జానకి దేవి, కటకం శెట్టి దుర్గాభవానిలకు చేరో పదివేల రూపాయలు నగదు, రాజోలుకు చెందిన బోనం హాసిని అనే విద్యార్థికి ఏడు వేల రూపాయల ఔషధాలు అందించారు. వాకర్స్ క్లబ్ మానవత్వంతో తమకు సహాయం అందించినందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తటవర్తి సుధాకర్, కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్,బసవరాజు, ధనాని శ్రీరామచంద్రమూర్తి, సలాది రామచంద్రరావు, పోతుల ఉమా శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.