పాలకొల్లు: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి పంచారామ క్షేత్రంలో కళ్యాణోత్సవాల్లో భాగంగా, భక్తుల కోసం నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన తిలకించిన భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంస్కృతిక ప్రదర్శనలు బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయి. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల శ్రీనివాస్ నృత్యకళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కళ్యాణోత్సవాల్లో భాగంగా ప్రధాన అర్చకులు క్రిష్టప్ప, అనిల్, ఆలయ ధర్మకర్తలు, పినిశెట్టి శ్రీనివాస్, బసవ సత్యనారాయణ, ఉప్పులపు పెద్దిరాజు, కొండ్రెడ్డి సూరిబాబు, నీలాపు మణి, పెనుమత్స శ్రీదేవి, ప్రవాళి, కుమారి, ఆలయ పర్యవేక్షకులు పసుపులేటి వాసు, చిట్టూరి గాంధీ, సిబ్బంది అన్నవరం, శ్రీనివాస్, జనార్ధన స్వామి, రామ్మోహన్ రావు, భక్తులు రంగానాయుడు తదితరులు సేవలు అందిస్తున్నారు.
క్షీరారామంలో నృత్య ప్రదర్శనలు.
నృత్య కళాకారులతో చైర్మన్ రాము, ఈవో శ్రీనివాస్