Skip to main content

Telugu News Power

జిల్లా అభివృధ్ధే ధ్యేయంగా సమగ్ర ప్రణాళిక. -బడ్జెట్ అవుట్ రీచ్ పై సమీక్ష

సమీక్ష సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ నాగరాణి, ఎంపీ పాకా సత్యనారాయణ, ఉపసభాపతి రఘు రామ కృష్ణంరాజు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ
సమీక్ష సమావేశం లో పాల్గొన్న అధికారులు

భీమవరం:మార్చి,31(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
కలెక్టరేట్‌ కార్యాలయంలో జరిగిన “బడ్జెట్ ఔట్‌రీచ్” సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం నిర్వహించారు. వ్యవసాయం, ఆక్వా రంగాలతో పాటు ఇతర రంగాలకు విస్తరించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు.
“స్వర్ణాంధ్ర విజన్ 2047” లక్ష్య సాధనలో భాగంగా తలసరి ఆదాయం పెంపు, గ్రామీణ ఉపాధి అవకాశాల విస్తరణ, పర్యాటక రంగ అభివృద్ధి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అధికారులు ముందస్తు ప్రణాళికలతో బడ్జెట్ వినియోగించాలని కోరారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొని జిల్లాను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా పలుసూచనలు చేశారు.