
పాలకొల్లు: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ హుండీని 105 రోజులకు లెక్కించారు. హుండి ఆదాయం రూ.18,97,247/- లు వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారులు, క్షీరపురి అన్నదాన సమాజం, ఎన్ రంగరాజన్, సలాది వారి సత్రం, వి. నాగజ్యోతి, చిన్న గోపురం, శంకర్, క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం, ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు, మీసాల రామచంద్రరావు, ధర్మకర్తల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆలయ అర్చకులు, హుండి కౌంటింగ్ సేవకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.