సఖినేటిపల్లి: జనవరి30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అంతర్వేది, దక్షిణ కాశి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారు, గజ, పొన్న వాహనములపై గ్రామోత్సవం చేశారు, భక్తులను అనుగ్రహించారు. స్వామివారు, సాయంత్రం, గజవాహన గ్రామోత్సవం విశిష్టత గురించి అర్చక స్వాములు వెల్లడించిన విశేషాలు. గజరాజులు రాజసానికి ప్రతీకలు. రణరంగంలో, రాజ దర్బారులో, ఉత్సవాల్లో గజరాజు ప్రాధాన్యతా స్థానం. గజరాజు తనపై స్వామివారిని అధిష్టించుకున్నట్టు, భక్తులు తమ హృదయ పీటికపై స్వామివారిని ఆగష్టించుకుని స్వామివారి కృపకు పాత్రులు అవుతారు. గజ వాహనం అంటే కర్మ విముక్తి. ఉదయం లేవగానే, ఐశ్వర్యానికి ప్రతీక అయిన గజముఖ దర్శనం వల్ల భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. మంగళకరమైన గజరాజు కు అతిశయమైన శుభం కలిగించేందుకు శ్రీ స్వామి వారు, గ్రామోత్సవంలో తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజ వాహనంపై ఊరేగుతారు. ఏనుగు ఓంకారానికి, విశ్వాసానికి సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడు, విశ్వాధారుడు, కనుక గజవాహన ఊరేగింపు ఎంతో సముచితం. మనలో అహంకారం తొలిగితే మనపై రక్షకుడుగా భగవంతుడు ఉంటాడని సంగతి గుర్తు చేస్తుంది.పొన్న వాహనం పై స్వామివారి గ్రామోత్సవం. స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా, శుక్రవారం, ఆరో రోజు రాత్రి, స్వామివారు పున వాహనంపై ఊరేగారు. ఈ వాహనం ప్రత్యేక సంతరించుకుంది, మిగతా వాహనాలన్నీ, వివిధ రూపాల్లో ఉంటే, పొన్న వాహనం మాత్రం, మహాభారత ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. కృష్ణుడు, గోపికల చీరలు దొంగిలించకపోయే ఘట్టం మధ్యలో నరసింహుడు లక్ష్మీసమేతుడై, కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తారు. పొన్న వృక్షం అంటే కల్ప వృక్షం. ఈ వృక్షంపై ఉన్న స్వామివారి దర్శించుకుంటే సకల కోరికలు సిద్ధిస్తాయని, పొన్నవాహన సేవ పరమార్థం.
పొలమూరు రాజులచే అన్న పర్వత నివేదన.
ఈ కార్యక్రమం, స్వామివారి ఎదురుగా అన్నాన్ని పర్వతంగా పోసి, దానిలో పప్పు, కూరలు, పులుసు, పెరుగు, బూరి, కదంబం, స్వామివారికి నివేదించి, భక్తులకు ప్రసాదంగా పెడతారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని, పశ్చిమగోదావరి జిల్లా, పొలమూరు రాజులు నిర్వహిస్తారు.