పాలకొల్లు: జనవరి, 27 (తెలుగు న్యూస్ పవర్) పదవీ విరమణ చేసిన గురువులు,గణతంత్ర దినోత్సవం సందర్భంగా, లంకలకోడేరులో ఘన సత్కారం అందుకున్నారు. ఈ గౌరవంతో, నూతన వరవడికి శ్రీకారం చుట్టారు, హెడ్ కానిస్టేబుల్ దీపాటి విజయ రావు. స్థానిక మండల పరిషత్, ఆదర్శ ప్రాథమిక పాఠశాల2, వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా, దండు చిన్న రామకృష్ణంరాజు, వేగేశ్న రామకృష్ణంరాజు, ఎస్ ఎల్ నరసింహారాజు, చొప్పల సువర్ణ రత్నం, కర్ని జోగయ్య, పి వరలక్ష్మి ఈ సత్కారం అందుకున్నారు. సత్కారం అందుకున్న వారు, వారి జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసినవారు. దండు చిన్న రామకృష్ణంరాజు, సైకిల్ పై తిరిగి, చందాలు సేకరించి, విశ్రాంత ఉపాధ్యాయులకు పాలకొల్లు లో శాశ్వత భవనం నిర్మించి పెట్టిన మహనీయుడు. వయసు 90 పైబడిన ఆరోగ్యంగా ఇప్పటికీ చక్కగా తిరగ గలుగుతున్నారు. నేటి తరానికి వీరందరూ ఆదర్శంగా నిలుస్తారు. వీరి సేవలను గుర్తించి, సత్కరించిన దిపాటి విజయరావును గ్రామస్తులు అభినందించారు.వీరు విద్యార్థులకు బహుమతులు కూడ అందజేశారు. పదవి విరమణ చేసిన బ్యాంకు అధికారి ఏలూరి రాజబాబు, పాఠశాల, అంగన్వాడీలకు 100 భోజనం పళ్ళాలు బహుకరించారు. వీరి ఔదార్యానికి, సర్పంచ్, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, దీపాటి విజయ రావు, ఏలూరి రాజబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిహెచ్ రజని, వరలక్ష్మి, కళా ప్రపూర్ణ,జీ ద్వారక, కే కోటేశ్వరరావు, ఎన్. దుర్గారావు, విద్యా కమిటీ చైర్మన్ దీపాటి విజయలక్ష్మి, రవికుమార్, సురేష్, సూర్య కుమారి, ప్రకాష్ రావు, పలువురు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవం గురువులకు ఘనసత్కారం.
సత్కారం అందుకున్న విశ్రాంత గురువులు