Telugu News Power

గత ఏడాదిపై ఓ విశ్లేషణ

పాలకొల్లు:డిసెంబర్,31(తెలుగు న్యూస్ పేపర్)
రాజకీయ పరిణామాలు

అంతర్జాతీయ ఘర్షణ కొనసాగుతుంది.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచంపై ప్రభావం చూపుతూనే ఉంది. ఇజ్రాయిల్-గాజా సంక్షోభం ప్రస్తుతానికి ముగిసింది. ప్రపంచ రాజకీయ ముఖచిత్రంపై అస్థిరత మేఘాలు కమ్ముకుని ఉన్నాయి.
భారతదేశం దౌత్యపరంగా కీలక పాత్ర పోషిస్తున్నది. అయితే విదేశాల్లో ఉన్న భారతీయులను పలుదేశాలు తిప్పి పంపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, సౌదీ అరేబియా. అమెరికా వలసదారులను సంకెళ్లు వేసి వెనక్కి పంపడం ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి తీరని మచ్చ గా మిగిలింది.

పకృతి వైపరీత్యాలు
ఆగ్నేయ ఆసియా సమాచారం ప్రకారం తుఫానులు భారీ వరదలు భూకంపాలు కారణంగా లక్షల మంది ఇబ్బందులు పడ్డారు. యూరప్ లో భారీ అగ్నిప్రమాదాలు ప్రజలు సమస్యలను ఎదుర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారీ ఆర్థిక నష్టాలు
శీతోష్ణస్థితి సంబంధిత నష్టాలు సుమారు 10.8 లక్షల కోట్ల రూపాయలు వరకు నష్టాలు సంభవించాయి.
స్విట్జర్లాండ్ లోని బ్లా టెన్ టెన్ గ్రామం పై భారీ పర్వత గ్లేషియయార్ విరుచుకుపడటంతో తీవ్ర నష్టం జరిగింది. భారతదేశంలో మెంథ తుఫాన్ తలుపు చెక్కతో కొట్టి పోతుందని భయపడితే,తమలపాకుతో ఇట్టని అట్టే వెళ్లిపోయి, ఓ మంచి తుఫానుగా పేరు తెచ్చుకోంది.

సినిమా
చైనా ఇనిమేటెడ్ యానిమేటెడ్ చిత్రం “నే ఝు 2” ప్రపంచవ్యాప్త వసూళ్లు రికార్డు సృష్టించింది. కొరియన్ చిత్రం “ది గ్రేట్ ఫ్లడ్” దిగ్భ్రాంతికర సంఘటనలతో ప్రేక్షకులను అలరించింది. భారతదేశంలో దూరందర్ 1000 కోట్లు వసూలు చేసింది. కాంతారా, చావ, సయ్యారా కూలి ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి. వార్ 2 మహావతార నరసింహ, ఓ జి, సంక్రాంతికి వస్తున్న వస్తున్నాం హౌస్ ఫుల్ చిత్రాలు, బానే సొమ్ము చేసుకొన్నాయి.

విపత్తు
చిలిదేశంలో వ్యవస్థల లోపం కారణంగా విపరీతమైన విద్యుత్ సమస్య ఎదుర్కొన్నారు.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ప్రపంచ విమానయాన చరిత్రలో భయానక, నిర్లక్ష్య ప్రమాదంగా నిలిచిపోయింది.

శాస్త్ర సాంకేతిక రంగం,
ప్రయోగ క్షేత్రం నుంచి చేసిన అంతరిక్ష పరిశోధనలు విజయవంతం అయ్యాయి.
జెవింట్ భూమి ఆకర్ష తరంగ సంభావ్య సంధానం ద్వారా పరమాణు నక్షత్ర సంఘటనకై గ్రావిటేషనల్ వేవ్ ట్రిగ్గర్ తో కొత్త పరిశోధనలు ముందుకు వచ్చాయి.

ఖగోళ శాస్త్ర పరిశోధన
ఇంటర్ స్టెల్లార్ ఆబ్జెక్ట్ నాసా యొక్క బయోగ్రహ లైఫ్గా సూచనలు వంటి అద్భుత విజ్ఞాన సంగతులు వెలువడ్డాయి.

ప్రజలపై ప్రభావం
స్టాక్ మార్కెట్లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థకు లాభాలు అందించాయి. భారతదేశంలో బంగారం ధరలు చుక్కలు దాటిపోయి శుభ శుభకార్యాలకు కూడా కొనలేని పరిస్థితుల లో చుక్కలు చూపిస్తున్నాయి. వెండి దగధగలు దగదగలు, కళ్ళు మీరీమెట్లు, కళ్ళు బైర్లు కమ్మేలా ఉండి రేట్లు అందకుండా పోయాయి.

శీతోష్ణస్థితి పై పరిశోధనల పై,COP 30 వంటి వేదికలపై పర్యావరణ మార్పులకు చర్యలు తీసుకోవడానికి ప్రపంచం దృష్టి పెట్టింది. యతావాత సామాన్య పరిస్థితులతోనే గత ఏడాది వీడ్కోలు చెప్పింది.