Skip to main content

Telugu News Power

ఎన్ జి ఓ నేతగా ముచ్చర్ల శ్రీనివాస రావు

ఆలయ ఈవో శ్రీనివాసరావు అభినందిస్తున్న చైర్మన్ రామచంద్ర రావు

పాలకొల్లు, జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు తాలూకా, ఎన్జీవో సంఘ ఉపాధ్యక్షులుగా ముచ్చర్ల శ్రీనివాస రావు ఇటీవల ఎంపి అయ్యారు. ప్రస్తుతం వీరు క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్యనిర్వహణాధికారిగా వీధుల్లో నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ముచ్చర్ల శ్రీనివాసరావును ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, పర్యవేక్షకులు పి వాసు, వారి సిబ్బంది అభినందించి,సత్కరించారు. పాలకొల్లు తాలూకాలో, పాలకొల్లు, పోడూరు, ఆచంట మండలాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. తనను సత్కరించిన, చైర్మన్, పర్యవేక్షకులు పి వాసు, వారి సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.