భీమవరం: ఫిబ్రవరి, 7(తెలుగు న్యూస్ పవర్) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో కోరారు. ఈ విద్యా సంవత్సరం,(26-27) ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఈనెల 19 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తుదారులు100 రూపాయల ఫీజు చెల్లించాలి. గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం ఖాళీ ఉన్న 6 నుంచి 10 తరగతులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని,ఆ ప్రకటనలు వివరించారు. వివరాలకు: 9014150557/9848872131 నంబర్లను సంప్రదించవచ్చు.
ఆన్ లైన్ లో http//apbragcet.apcfss.in
వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. బంగారు భవిష్యత్తు కోసం ఈ అవకాశాన్ని సద్దినం చేసుకొని జిల్లా కలెక్టర్ నాగరాణి విజ్ఞప్తి చేశారు.
గురుకుల పాఠశాల ప్రవేశానికి దరఖాస్తులు.