Telugu News Power

గెద్దాడ చంద్రకళ, ఏ ఎస్ ఓ కు ఎంపిక.

పాలకొల్లు: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఇటీవల , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నిర్వహించిన, గ్రూప్2 పోటీ పరీక్షలో స్థానిక, చిట్టివాని గురువుకు చెందిన గెద్దాడ చంద్రకళ విజయం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వ, సాధారణ పరిపాలన శాఖ లో సహాయ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి చంద్రకళ ఎంపికయ్యారు. ప్రస్తుతం వీరు, యలమంచిలి మండలం చించినాడ, సచివాలయంలో, డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఇంజనీరింగ్ పట్టబద్రులు. తండ్రి గెద్దాడ వెంకట సత్యనారాయణ, వ్యవసాయదారులు, తల్లి వెంకట సత్యవతి గృహిణి. వీరికి కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్రకళ రెండవ సంతానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, పశ్చిమగోదావరి జిల్లా శాఖ, యలమంచిలి మండల సచివాలయం ఉద్యోగుల సంఘం , ఈ సందర్భంగా చంద్రకళను అభినందించారు.