Telugu News Power

గైనకాలజిస్ట్ కోసం ధర్నా చేస్తా – రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అల్టిమేట

ఆసుపత్రి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

రాజోలు: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) నెలరోజులలలోపు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టు పోస్టు భర్తీ చేయకపోతే ఆసుపత్రి వద్ద స్వయంగా ధర్నా చేస్తానని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులను హెచ్చరించారు. జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మంగళవారం ఎమ్మెల్యే దేవ మాట్లాడుతూ, తాను గత రెండు సంవత్సరాలుగా రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు గైనకాలజిస్ట్ ను నియమించమని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళినా، ఇంతవరకూ పోస్టు భర్తీ చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టు ప్రతిపాదికనైనా గైనకాలజిస్ట్ నియమించి పేద మహిళలకు వైద్య సేవలు అందించాలని కోరారు.
రాష్ట్రంలో జనసేన గెలిచిన మొట్టమొదటి నియోజకవర్గం రాజోలు. ప్రస్తుత ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఉన్నతాధికారి హోదాలో పనిచేసిన వ్యక్తి. కూటమితో అధికారం పంచుకుంటున్న, జనసేన పార్టీ ఎమ్మెల్యే. గత రెండేళ్లుగా ఇక్కడే పరిస్థితి ఇలా ఉంటే, అది నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమేరకని విమర్శలు వినిపిస్తున్నాయి.