Skip to main content

Telugu News Power

క్షయ వ్యాధి నివారణ పై అవగాహన శిబిరం.

పాలకొల్లు: మార్చి, (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా, స్థానిక లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద బుధవారం అవగాహన నిర్వహించారు. టిబి విముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, డాక్టర్ నవ్య జీవన్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ, టీబీ వ్యాధిగ్రస్తులు 100 రోజుల్లో పూర్తిగా నయం చేసుకునే మందులు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాధి పట్ల ఆందోళన అవసరం లేదని, సకాలంలో, ఆసుపత్రిలో ఉచితంగా అందించే వైద్య పరీక్షలు చేయించుకుంటే రోగులు త్వరలోనే వ్యాధి నుంచి బయట పడతారని పేర్కొన్నారు. తరచూ దగ్గు రావడం, జ్వరం రావడం, నీరసం, చాతిలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో, డాక్టర్ జి దినేష్, ఆరోగ్య విస్తరణ అధికారి గుడాల హరిబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.