Telugu News Power

‘గోపిశెట్టికి’ సన్మానం

కవిత బేబీని సత్కరిస్తున్న ప్రముఖులు

పాలకొల్లు: డిసెంబర్, 6(తెలుగు న్యూస్ పవర్) ఇటీవల జాతీయస్థాయి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కు ఎంపికైన లంకలకోడేరుకు చెందిన గోపిశెట్టి కవిత బేబీని పెన్షనర్లు సత్కరించారు. స్థానిక పెన్షనర్ల భవనం, తమ్మినీడి సుబ్బారావు హాల్లో, మంగళవారం, కార్యదర్శి డాక్టర్ ప్రతాప్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జరిగింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత వంగ నరసింహా రావు అధ్యక్షుత వహించారు. ఈ సందర్భంగా పలువురు, విశ్రాంత ఉద్యోగులు, బేబీని ఆశీర్వదించి, అభినందించారు. ఉద్యోగంలో వచ్చే వడిదుడుకులను తట్టుకొని, నిజాయితీగా ఉద్యోగం చేయాలని, సాటివారికి సాయం చేయాలని పలువురు వక్తలు విజ్ఞప్తి చేశారు. ఐఐటి ఖరగ్పూర్ లో ఎంటెక్, ఎలక్ట్రానిక్స్ చేశారు.

జాతీయస్థాయిలో జరిగే ఐఇఎస్ పరీక్షలో 48 వ ర్యాంకు సాధించి నందుకు ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత బేబీ మాట్లాడుతూ, తనకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాల్యంలో వేసిన పునాదుల వల్లే ఈ ర్యాంకు సాధించగలిగానన్నరు.

ప్రభుత్వం ఉపకార వేతనం అందించి, చక్కటి అవకాశం కల్పించింది. అందుకు, భారతదేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వీస్ ఎంచుకున్నట్టు వెల్లడించారు. తన ఉన్నతికి పాటుపడిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు వంగ నరసింహారావు, డాక్టర్ ప్రతాప్ రాజు, మాడభూషి కృష్ణ ప్రసాద్, డి ఆర్ కె రాజు, భవన నిర్మాత డి సి హెచ్ రామ కృష్ణంరాజు, అశ్విని కుమార్, కే వెంకటపతి వర్మ, ప్రసాద్ మాస్టర్, గుత్తుల సత్యనారాయణ మూర్తి, పాలేశ్వరి, హైమావతి, బాలాజీ పాల్గొన్నారు.

బేబీని సత్కరిస్తున్న విశ్రాంత మహిళా ఉద్యోగులు