భీమవరం: మార్చి, 10(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక ఎంపీ, భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ కేంద్ర సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస కృషితో కొత్త రైలు పట్టాలెక్కనుంది. ఈనెల 13న ఈ రైలు ప్రారంభం కానుంది.
చర్లపల్లి (హైదరాబాద్) కామాఖ్య (గౌహతి – అస్సాం) అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌ను ఈశాన్య భారతంతో అనుసంధానిస్తూ, సామాన్య ప్రయాణికుల చిరకాల వాంఛను నెరవేరుస్తోంది. ఈ నూతన రైలు సర్వీసు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారతీయ రైల్వే అత్యంత ఆధునిక సాంకేతికతతో ఈ “అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్”ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ రైలు ద్వారా పశ్చిమగోదావరి జిల్లా నుంచి రాజమండ్రి, వైజాగ్ వెళ్లే ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన, సౌకర్యాలతో కూడిన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.
నరసాపురం పార్లమెంట్ పరిధిలోని తణుకు, భీమవరం టౌన్ స్టేషన్లలో ఈ రైలుకు హాల్ట్ ఉంటుంది.గంటకు 130 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.
మధ్యతరగతి, సామాన్య ప్రజల కోసం అతి తక్కువ ధరలో అత్యుత్తమ వసతులు ఈ రైల్లో ఉంటాయి.పుష్-పుల్ సాంకేతికత, బయో-వాక్యూమ్ టాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు మరియు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లతో అధునాతన సౌకర్యాలు కల్పించారు.
ఈ అద్భుతమైన రైలు సర్వీసును ఈ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి వర్మ కోరారు.
గౌహతికి కొత్త రైలు13న ప్రారంభం.