Telugu News Power

గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు

బహుమతి ప్రధానం చేస్తున్న జక్కపూడి కుమార్

పాలకొల్లు, నవంబర్ 20 తెలుగు తెలుగు న్యూస్ పవర్ 58వ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా పాలకొల్లు గ్రంధాలయం వద్ద వివిధ పోటీలు నిర్వహించారు గురువారం సాయంత్రం బహుమతి ప్రధానోత్సవం జరిగింది ఈ సంవత్సరం వివిధ పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో దుర్గా కిషోర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి పుస్తకాలు పుస్తక పఠనం అలవాటు చేసుకో వాలని కోరా కోరారు. బిజెపి నాయకులు యొక్క భూకుమార్ జక్కంపూడి కుమార్ మాట్లాడుతూ గ్రంథాలయానికి శాశ్వత భవన్ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. గ్రంథాలయంలో పుస్తకాలు కొరత విషయం మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పీ.ఆర్. ఓ సాంబశివరావు,బీజేపీ నాయకులు కొల్లి కొండ ప్రసాద్, జనసేన నాయకులు తులా రామలింగేశ్వర రావు, ఎంఈఓ గుమ్మళ్ళ వీరాస్వామి మాట్లాడారు.ఈ సందర్భంగా సత్య వర్ధన్ గీతాలాపన సభికులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గ్రంథపాలకురాలు వి.శాంతకుమారి సేవలను వక్తలు ప్రశంసించారు. ఈ సభలో గ్రంధాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వంగా నరసింహారావు, ఉపాధ్యక్షులు పీతల వెంకట్ ఆనంద్ కుమార్, కార్యదర్శి కె వి వి సత్యనారాయణ సహాయ కార్యదర్శి జి సీతారాం, కార్యవర్గ సభ్యులు పోలిశెట్టి గోఖలే,మాడభూషి కృష్ణ ప్రసాద్, బైలా శ్రీధర్ కానుకొలను శ్రీనివాస్, శ్రీదేవి,ఆవాల పెద్దిరాజు ,మజ్జి సన్యాసి నాయుడు, తోలేటి రామచంద్ర కోప్పినీడి కళ్యాణ్ కుమార్, వెంకట్రావు, యు .పెద్దిరాజు చందాని లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

 

గ్రంధాలయ ఓరోత్సవారా ముగింపు సభలో మాట్లాడుతున్న ఎమ్మార్వో యడ్ల దుర్గాప్రసాద్.