Telugu News Power

గ్రామం మనకేమిచ్చిందని కాదు, గ్రామానికి ఏమిచ్చామని ఆలోచించాలి. – గాంధీ మెగా ఫౌండేషన్ చైర్మన్ భగవాన్ రాజు.

గ్రామాభివృద్ధి గురించి వివరిస్తున్న, గాంధీ భగవాన్ రాజు

పాలకొల్లు: జనవరి, 24, (తెలుగు న్యూస్ పవర్) గ్రామం మనకేమిచ్చిందని కాకుండా, గ్రామానికి మనమేమి ఇచ్చామని, ఆలోచించాలని, పూలపల్లి గాంధీ మెగా ఫౌండేషన్ చైర్మన్, ఏఎంసి,మాజీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పిలుపునిచ్చారు. పచ్చదనం-పరిశుభ్రం కార్యక్రమంలో భాగంగా,స్థానిక ఆఖరి మజిలీ రోడ్డు మార్గాన్ని,స్మశానవాటికను, గ్రామ ప్రజలు, పంచాయతీ అధికారులతో కలిసి శనివారం శుభ్రంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, గాంధీ మెగా ఫౌండేషన్ గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు. స్థానిక శాసనసభ్యులు నిర్మల రామానాయుడు నాడు, సర్వమత, సర్వుల స్మశాన వాటికకు 15 లక్షల నిధులు ఇచ్చారన్నారు. ఇల్లు లేని145 మందికి, స్థలం ఇవ్వగా, తన సొంత నిధులు పది లక్షలు వెచ్చించి పూడికపని చేసామన్నారు. స్మశాన వాటికలో అమృత లింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేశామన్నారు. ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు 15 లక్షలు నిధులు కేటాయించారన్నారు. గత ఆరేళ్లుగా పూలపల్లి గ్రామానికి రావలసిన నిధులు రాకపోవడం వల్ల అభివృద్ధి జరగలేదన్నారు. ఇకనుంచి ప్రతివారం, గ్రామస్తులతో కలిసి గ్రామ అభివృద్ధి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి భగవాన్ రాజు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్మశాన వాటిక శుభ్రం చేస్తున్న గాంధీభగవాన్ రాజు