Telugu News Power

ఘనంగా నాగుల చవితి #news #entertainment #telugu #palakollu

 

దీపావళి తరువాత వచ్చే నాగుల చవితి శనివారం భక్తిశ్రద్ధలతో భక్తులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పొలాలు, తోటలు గుడులలో ఉన్న పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. నాగదేవతల పుట్టల వద్ద మందులు కాల్చి, పటాసులు పీల్చారు. ఉదయం నుంచి భక్తులు నాగదేవతల పుట్టల వద్దకు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. పుట్టలు ఉన్న దేవాలయల వద్ద రద్దీ నెలకొంది. తక్షయజ్ఞంలో పడి నాగజాతి బూడిది కావటం ఆగిన సందర్భంగా ఈ నాగుల చవితి పండుగ చేసుకుంటారని పురాణ గాథ. హిందువుల ప్రతి పండుగ ప్రకృతితో మమేకమై ఉంటుంది సహజ ప్రకృతికి నాగులు సహకరిస్తాయి. శివుని అలంకారాలుగా, విష్ణుమూర్తి పవళింపుకు ఆదిశేషులు సేవలందించడం మనిషికి నాగులకు ఉన్న సాన్ని హిత్యాన్ని తెలుపు. ఈ సందర్భంగా పలువురు భుక్తికి ఏదో ఒక వ్యాపారం చేస్తారు. ఒక తేగ వారి పది రూపాయలు పలికింది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు తమ భక్తి చాటుకొన్నారు.