Skip to main content

Telugu News Power

డంపింగ్ యార్డ్లు ఇక మాయం! #news #telugu #nimmala #palakollu

 

వచ్చే వేసవి నాటికి డపింగ్ యార్డులు మాయం. డంపింగ్ యార్డ్ ల సమస్య వచ్చే వేసవి నుంచి ఉండబోదని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. పాలకొల్లు ఫైర్ స్టేషన్ నుంచి పెనుమదం రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు పనులకు శనివారం శ్రీనిధి రెస్టారెంట్ దగ్గర లో శంకుస్థాపన చేసారు.సుమారు కోటిన్నర రూపాయలు తో ఈ సీసీ రోడ్డు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు.ఎన్నో ఏళ్ళ గా ప్రజలును తీవ్ర ఇబ్బందుల పాలుచేస్తున్న డంపింగ్ యార్డు సమస్యకు ముగింపు పలకడానికి తీవ్ర కృషి జరుగుతుందని తెలిపారు. భరించలేని దుర్గంధం, విషపూరితమైన పొగ వల్ల ఎదురయ్యే ప్రమాదం ఇక ఉండదన్నారు. డిపింగ్ యార్డు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కొన్ని కోట్లు రూపాయల తో అబ్దుల్ కలాం ఆరోగ్య పార్క్ నిర్మాణం, మురికి కాలవల ఆధునీకరణ చేపట్టామన్నారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి ఆక్రమణలు తొలగించి వివిధ మార్గాల్లో ఆధునీకరణ చేపట్టామన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇక చాలా పార్కులు వస్తాయన్నారు. మున్సిపల్ వార్డులు 9నుంచి 12 వరకు సబ్ ప్లాన్ నిధులు 45కోట్లు, భవనానికి 3.5 కోట్లు, పార్క్ కు 40 కోట్లు, , దమ్మయ్పర్తీ డ్రైన్ కు14 కోట్లు, మంచి నీటి పథకానికి 15కోట్లు తమ హయాంలో ఖర్చు చేశామన్నారు. అయినప్పటికీ 30శాతం ఓట్లు కూటమి కి రాలేదన్నారు. పనిచేసే కూటమి పార్టీకే మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.