Telugu News Power

ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు
ధర్మారావు ఫౌండేషన్ ద్వారా, దుప్పట్లు బట్టలు పంపిణీ

పాలకొల్లు: జనవరి,23(తెలుగు న్యూస్ పవర్) తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్, 43వ పుట్టినరోజు వేడుకలు పాలకొల్లు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, మాట్లాడుతూ, కార్పొరేట్ స్థాయి పాఠశాలలో మాత్రమే ఉండే, మెగా పేరెంట్స్, టీచర్స్ డే ఏర్పాటుచేసి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య జవాబు దారి తనం తీసుకువచ్చారన్నారు. ఐటి కంపెనీలు తీసుకువచ్చి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. చిన్న వయసులోనే, పరిణితి చెందిన నేతగా ఎదిగారన్నారు. భవిష్యత్తులో తండ్రికి మించిన తనయుడుగా, ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. టిడిపి పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వర రావు, మాట్లాడుతూ, నారా లోకేష్ యువగళం పాదయాత్రలో, అధికార పక్షం ఎన్ని సమస్యలు సృష్టించిన, అవమానపరిచినా, మొక్కవోని విశ్వాసంతో ముందుకు సాగిన ధీరుడు లోకేష్ అన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి, లోకేష్ సమర్థత గుర్తించారన్నారు. లోకేష్ పుట్టినరోజు, ధర్మారావు ఫౌండేషన్ ద్వారా వృద్ధులు, దివ్యాంగులకు, బట్టలు, దుప్పట్లు, పంచారు. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర, పళ్ళు, రొట్టెలు పంచారు. నియోజకవర్గస్థాయిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్ కోడి విజయ భాస్కర్, కర్నేని రోజారమణి గౌర్నాయుడు దంపతులు, టిడిపి మండల అధ్యక్షులు పాముల రజిని కుమార్, మామిడిశెట్టి పెద్దిరాజు, రమేష్ రాజు, కాలవలస తులసిరావు, మాజీ జడ్పిటిసి బోనం నాని, సొసైటీ అధ్యక్షులు బొప్పన హరి కిషోర్, గొట్టుముక్కలు సూర్యనారాయణ రాజు, రాంభద్ర రాజు, తుల రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పళ్ళు,రొట్టెలు పంపిణీ