Telugu News Power

ఘనంగా భక్తాంజనేయ స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం.

ఆంజనేయ స్వామి వారికి అభిషేకం
సువర్చల సహిత కళ్యాణ ఆంజనేయుల వారు

యలమంచిలి: ఫిబ్రవరి,6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక పెదచెరువు వద్ద వేయించేసి ఉన్న శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా, స్వామివారికి పంచామృత ఫల రసాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తమలపాకులు,సింధూరంతో సహస్రనామార్చన జరిగింది. భక్తాంజనేయ స్వామి వారికి శాంతి కల్యాణం చేశారు. ఈ వార్షికోత్సవ, అభిషేకపూజా కార్యక్రమానికి భక్తులు విశేషంగా తరలి వచ్చారు. ఆలయ చైర్మన్ కాసా సత్యనారాయణ, బండారు రాధాకృష్ణ, ఆకుల భాస్కరరావు, ఆకుల నరసింహారావ, ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి గోపి, పలువురు గ్రామ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.