Telugu News Power

చండీ హోమం, మారేడు దళ ప్రదక్షిణలు.

ప్రదక్షిణాలు చేస్తున్న భక్తుల తో ఈఓ శ్రీనివాసరావు

పాలకొల్లు: మార్చి, 2(తెలుగు న్యూస్ పవర్.కాం) స్థానిక శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం ఉదయం చండీ హోమం నిర్వహించారు. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న 14 మంది దంపతులతో పూజలు చేయించారు. ఏడు మారేడు దళములుతో, ఏడు ప్రదక్షిణాలు సోమవారం క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షణలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. రాత్రికి ధూప సేవ, పంచ హారతి సేవ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ముత్యాల శ్రీనివాసరావు, పర్యవేక్షకులు పి వాసు, సిబ్బంది పలువురు భక్తులు పాల్గొన్నారు