పాలకొల్లు: డిసెంబర్,27(తెలుగు న్యూస్ పవర్) క్రైస్తవులు, క్రైస్తవం, ఏదో ఒక మతానికి, కులానికి మాత్రమే పరిమితం అయ్యింది కాదని, ప్రపంచవ్యాప్తంగా అనుసరించదగిన ఒక జీవన విధాన మార్గమనిస్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి సొంత క్యాంపు కార్యాలయ ఆవరణలో శనివారం రాత్రి క్రిస్మస్ పండుగ బాహుబలి స్థాయిలో, ఘనంగా జరిగింది. ఏటా ధర్మారావు ఫౌండేషన్ తరపున ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుతారు. ఈ ఏడాది ఈ క్రిస్మస్ వేడుకలు మరింత శోభాయమానంగా నిర్వహించారు. క్రీస్తు జననం అనే భారీ నాటక ప్రదర్శన జరిగింది. దాదాపు 70 మంది కళాకారులు ఈ నాటకంలో పాత్రలు పోషించారు. ఆధునికతను అందిపుచ్చుకున్న ఈ నాటకం, చూపరులను మైమరిపించింది. భారీ ఎల్ఈడి స్క్రీన్ పై నిజంగా ఏసుక్రీస్తు కాలం నాటి దృశ్యాలను కళ్ళ ముందు ఆవిష్కరించారు. నాటకం తో పాటు, వీక్షకులు కూడా తన్మయత్వంతో ఆ కాలంలోకి జారిపోయారు. ఎంతో పగడ్బందీగా, ఎప్పటికప్పుడు ఆయా సీన్లకు తగ్గట్టుగా రంగాలంకరణ వీక్షకులను ఆకట్టుకుంది. దర్శకులు బిగింపుతో ఈ కథా కధనాన్ని ఆసక్తికరంగా మలిచారు. ఎల్ఈడి కాంతులు ఫోటోగ్రఫీని మించిపోయే ఎఫెక్ట్స్ ఇచ్చాయి. అందుకు అనుగుణమైన సంగీతం అమరింది. మంత్రి సామాన్య ప్రేక్షకుడి వలె, ప్రేక్షకుల మధ్య కూర్చుని,ఈ నాటకాన్ని వీక్షించారు. నాటకం భారీగా ఉన్న, చూడాలనే ఉత్సుకత కల్పించడం వల్ల, అప్పుడే అయిపోయినట్టు అనిపించింది. పాత్రధారులకు అవసరమైన వస్త్రాలంకరణ, పాత్రల అలంకరణ చూపరులను మంత్రముగ్ధులను, (మెస్మరైజ్) చేశాయి. ఈ నాటక సమాజం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని, తద్వారా ప్రతి గ్రామానికి క్రీస్తు బోధన చేరేలా కృషి చేస్తానని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. ఈ నాటకం తనకు ఎంతో నచ్చిందని, అరే అప్పుడే అయిపోయిందా! అనిపించింన్నారు. నాటకం అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. క్రైస్తవ గీతాలాపనలతో గాయని, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీవాణి, తన బృందంతో భక్తి గీతాలతో అలరించారు, కొన్ని గీతాలతో జోష్ తో ఉర్రూతలూగించారు. పలువురు పాస్టర్లను వేదికపై ఘనంగా మంత్రి నిమ్మల రామానాయుడు సత్కరించారు. క్రిస్మస్ కేక్ కటింగ్ బాణా సంధ్య కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నియోజకవర్గంలో ఉన్న ప్రతి చర్చ్ నుంచి కనీసం ఐదు ఆటోల్లో క్రైస్తవ భక్తజనులు కనీసంగా తరలివచ్చారు. వీరికి తగ్గట్టుగా తేనీరు,మంచినీళ్లు ఆయా కౌంటర్ల వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి, వివిధ విభాగాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు బాధ్యత తీసుకున్నారు. క్రైస్తవ భక్తులకు కార్యక్రమానంతరం పసందైన ప్రేమ విందు ఏర్పాటు చేశారు. చరిత్ర సృష్టించిన ఈ మెగా కార్యక్రమంలో, తెలుగుదేశం నాయకులు కోడి విజయభాస్కర్, ఉన్నమట్ల కపర్ది, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, రామ్ భద్ర రాజు, బొప్పన చిన్న, ఆరమిల్లి రామ శ్రీనివాస్, పాలవలస తులసీరావ్, ఆర్ సత్యనారాయణ రాజు, గొట్టుముక్క సూర్యనారాయణ రాజు, కడలి గోపి, దాసరి రత్నం రాజు, తదితర పలువురు నాయకులు పాల్గొని, అత్యంత జన సందోహంతో ఉక్కిరి బిక్కిరి అయిన, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. పోలీసు వారు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా బందోబస్తు విధులు నిర్వర్తించారు.

