Telugu News Power

చాంబర్స్ విద్యార్థులు 31మందికి ఉద్యోగాలు.

ఉద్యోగార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న చైర్మన్ నరసింహారావు

పాలకొల్లు: మార్చి, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక ఛాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల ప్రాంగణంలో బుధవారం క్యాంపస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్ జరిగింది. ఛాంబర్స్ విద్యార్థులు 31 మంది ఎంపికయ్యారు.వీరిలో హెటిరో ల్యాబ్స్ కి 15మంది,ఫాక్స్కాంన్ కు 14 మంది,టాటా ఎలక్ట్రానిక్స్ కు ఇద్దరు ఎంపికైయ్యారని కళాశాల చైర్మన్ శ్రీ కెవిఆర్ నరసింహారావు తెలిపినారు.
హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్ కంపెనీలు కు ప్రాంగణ ఎంపికలు జరిగాయి.ఈ ప్రాంగణ ఎంపికలకు 56 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికి ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ మరియు హెచ్ఆర్ రౌండ్స్ నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులకు నెలకు18వేల నుండి 25 వేల రూపాయల వేతనం లభిస్తుంది. ఎంపిక ప్రక్రియను హెచ్ఆర్ లు టి . విజయ్ కుమార్, బి. శ్రీనివాస్ లు ఆధ్వర్యంలో జరిగిందని,కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు తెలిపారు.
ఈ ఎంపికైన విద్యార్థులకు కంపెనీ ఆఫర్ లెటర్స్ కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు మరియు అకాడమిక్ అడ్వైజర్స్ డాక్టర్ ఏబిఎస్ మూర్తి , నందుల సీతారామరావు , కళాశాల ట్రెజరర్ ప్రవీణ్ భాను, కంపెనీ హెచ్ఆర్లు కళాశాల ప్లేస్మెంట్ అధికారి జానకిరామయ్య చేతులమీదుగా అందజేసారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీ కె.వి.ఆర్ నరసింహారావు మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో నైపుణ్యంతోనే ఉద్యోగం సాధ్యమవుతుందని, అకాడమిక్ పెర్ఫార్మన్స్ తో పాటు మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్,
అర్థమెటిక్ రీజనింగ్, టెక్నికల్ స్కిల్స్ లాంటివి తమ కళాశాలలో అందించడం ద్వారా సాధారణ విద్యార్థులకు కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని , దీనికి కృషి చేస్తున్న అధ్యాపక బృందానికి అభినందనలు తెలుపుతూ సెలెక్ట్ అయిన విద్యార్థులకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందుపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికరి జానకిరామయ్య, అధ్యాపకులు ఎన్. రవికుమార్, శివప్రసాద్ వర్మ, మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.