Telugu News Power

చావాకులకు వివేకానంద ఇన్స్పిరేషనల్ అవార్డ్

అవార్డు అందుకుంటున్న సూర్య నరేష్

విజయవాడ/పాలకొల్లు: జనవరి 11 (తెలుగు న్యూస్ పవర్) పాన్ ఇండియ సోషియో కల్చరల్ అసోసియేషన్, విజయవాడ వారి ఆధ్వర్యంలో, స్వామి వివేకానంద 163 జయంతి ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వివేకానంద జాతీయ ప్రతిభా పురస్కార కార్యక్రమం జరిగింది. పాలకొల్లు, చావాకుల చారిటబుల్ ట్రస్ట్ ఈ అవార్డు ఎంపికయింది. ట్రస్ట్ అధ్యక్షులు చవాకుల సూర్య నరేష్ బాబు ను వివేకానంద ఇన్స్పిరేషనల్ అవార్డు 2026 తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్నారై టిడిపి కోఆర్డినేటర్,అమెరికా, తానా పూర్వ అధ్యక్షులు కోమటి జయరాం, శ్రీశ్రీ కళావేదిక కత్తిమండ ప్రసాద్, ఎన్ఆర్ఐ టిడిపి సెల్, చప్పిడి రాజశేఖర్, మిరియాల వెంకటరమణయ్య, బాలగంగాధర్ తిలక్, న్యాయవాది కేజే రాజు, డాక్టర్ శేషు కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేష్ బాబు ను మంత్రినిమ్మల రామానాయుడు, మాజీ ఎంపీ చేగుండి హరి రామ జోగయ్య, వంగ నరసింహారావు, తదితరులు అభినందించారు.