
యలమంచిలి: ఫిబ్రవరి,8(తెలుగు న్యూస్ పవర్)
,శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి అంతర్వేది క్షేత్రానికి భక్తులు పాదయాత్ర చేశారు.. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం, చించినాడ గ్రామం నుంచి, అంతర్వేది క్షేత్ర దర్శన పాదయాత్ర ఆదివారం ఘనంగా జరిగింది. తొలిసారి. ప్రారంభించిన ఈ పాదయాత్రలో . వందల మంది భక్తులు పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర సుమారు రెండు గంటల సాగింది. భక్తులు ఆంజనేయస్వామి, జెండా చేపట్టి,వివిధ దేవుళ్ళ నామస్మరణ చేస్తూ ఉత్సాహంగా ఈ పాదయాత్ర కొనసాగించారు. ఈ పాదయాత్రలో భక్తులకు మంచినీళ్లు, పాలు ,మజ్జిగ శీతలపానీయాలు, పుచ్చకాయలు వంటివి డిహైడ్రేషన్ రాకుండా అందజేశారు. చించినాడ వేణుగోపాలస్వామి అర్చకుల ఆధ్వర్యంలో యాత్ర దిగ్విజయంగా తొలి విజయం నమోదు చేసుకుంది. గత మూడు ఏళ్లగా ఈ కార్యక్రమం కోసం భక్తులు ప్రయత్నం చేస్తున్నారు. చించినాడ గ్రామానికి చెందిన హిందూ భక్తులు, ముఖ్యంగా మహిళలు ఈ యాత్ర చేయడానికి ముందుకు వచ్చారు. పాలకొల్లు పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు రమణ గురుస్వామి ఆశీస్సులు ఈ యాత్రకు ఉన్నట్టు తెలిసింది.